Abn logo
Aug 6 2020 @ 23:40PM

లాక్‌డౌన్‌లో ఏం జరిగింది?

లాక్‌డౌన్‌ సమయంలో జరిగిన కొన్ని సంఘటనలను ఆధారం చేసుకొని రూపొందించిన చిత్రం ‘లాక్‌డౌన్‌’. ఈ సినిమా సమర్పకుడైన షేర్‌ సంభాషణలు, సంగీతం కూడా సమకూర్చారు. ఈ సినిమా టీజర్‌ను తెలంగాణ ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్‌, అట్లూరి రామకృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా షేర్‌ మాట్లాడుతూ ‘యువతులకు మంచి ధైర్యం ఇచ్చే సినిమా ఇది. చక్కని సందేశంతో పాటు మంచి కామెడీ సన్నివేశాలు కూడా ఉన్నాయి’ అని తెలిపారు. ఈ చిత్రానికి పాటలు: భాషశ్రీ, కథ, స్ర్కీన్‌ప్లే, సంగీతం: షేర్‌, నిర్మాత: మిన్నా, దర్శకత్వం: బాబా.

Advertisement
Advertisement
Advertisement