Abn logo
May 14 2020 @ 00:35AM

లాక్‌డౌన్‌ను కచ్చితంగా పాటించాలి

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు


తొర్రూరు, మే 13: కేసీఆర్‌ స్ఫూర్తితో దాతలు పేద ప్రజలను ఆదుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. తొర్రూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం ఉత్సవ్‌ కల్చరల్‌ అండ్‌ డెవల్‌పమెంట్‌ సొసైటీ సహకారంతో 800 మంది నిరుపేదలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.  ఈ కార్యక్రమంలో ఉత్సవ్‌ కల్చరల్‌ డెవల్‌పమెంట్‌ అధ్యక్షుడు డాక్టర్‌ సోమేశ్వర్‌రావు, కమిషనర్‌ బాబు, ఎంపీపీ టీసీ అంజయ్య, జడ్పీటీసీ శ్రీనివాస్‌, చైర్మన్‌ రాంచంద్రయ్య, బిందు శ్రీనివాస్‌, సీతారాములు, వైస్‌ చైర్మన్‌ సురేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement