Abn logo
Aug 8 2020 @ 21:47PM

పశ్చిమ గోదావరి జిల్లాలో సంపూర్ణంగా లాక్ డౌన్

ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో రేపు అనగా ఆదివారం నాడు సంపూర్ణంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు కలెక్టర్ ముత్యాల రాజు ఓ ప్రకటనలో తెలిపారు. ఆదివారం ఉదయం ఆరు గంటల నుంచి ఎల్లుండి (సోమవారం) ఉదయం ఆరుగంటల వరకు లాక్ డౌన్ ఆంక్షలు ఉంటాయని కలెక్టర్ ప్రకటనలో పేర్కొన్నారు. రేపు గిరిజన దినోత్సవం సందర్భంగా 5 ఏజెన్సీ మండలాలకు లాక్ డౌన్ నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వడం జరిగింది.


కాగా.. ఇవాళ జిల్లాలో 681 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరోజే జిల్లాలో పది మంది చనిపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లాలో అయితే భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఇవాళ ఒక్కరోజే జిల్లాలో 1310 కేసులు నమోదవ్వడం గమనార్హం.

Advertisement
Advertisement
Advertisement