Abn logo
Sep 24 2021 @ 23:10PM

రూ. 2వేల కోట్ల రుణాల లక్ష్యం

డీసీసీబీ చైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి

పెళ్లకూరు, సెప్టెంబరు 24 : ఈ ఆర్థిక సంవత్సరానికి కోఆపరేటీవ్‌ బ్యాంకుల తరఫున రూ. 2వేల కోట్ల రుణాలను రైతులకు ఇచ్చేందుకు లక్ష్యంగా నిర్ణయించినట్లు డీసీసీబీ చైర్మన్‌ కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన స్థానిక పీఎసీఎస్‌ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడుతూ మండలంలోని చిల్లకూరు సొసైటీకి ప్రభుత్వం మూడు గోదాములను మంజూరు చేసిందన్నారు. జిల్లాలోని అన్ని బ్రాంచుల్లో కంప్యూటీకరణ చేపడుతున్నట్లు తెలిపారు. సొసైటీ తరఫున గృహనిర్మాణాల కోసం భూమి మార్కెట్‌ విలువ ప్రకారం తక్కువ వడ్డీతో రుణాలు మంజూరు చేస్తామన్నారు.  ప్రభుత్వం స్వయం సహాయక బృందాలకు రుణాలను ఇచ్చేందుకురూ. 200 కోట్ల మంజూరు చేసిందని తెలిపారు. అలాగే సొసైటీల ద్వారా బంగారు ఆభరణాలపైన 33 పైసల వడ్డీతో రుణాలను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.  తెలిపారు.  సమావేశంలో డీసీసీబీ జనరల్‌ మేనేజర్‌ సరిత, నాయుడుపేట బ్రాంచ్‌ మేనేజర్‌ చంద్రశేఖర్‌, సోసైటీ అధ్యక్షుడు మద్దాలి సోమశేఖర్‌రెడ్డి, ఎంపీపీ పొలంరెడ్డి శేఖర్‌రెడ్డి, సొసైటీ సూపరింటెండెంట్‌ పరంధామయ్య పాల్గొన్నారు.