Abn logo
Jul 15 2020 @ 00:13AM

మద్యం దుకాణాలను మూసివేయాలి

రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు కరోనా వైరస్ ఉధృతి తీవ్రమవుతున్న నేపధ్యంలో పలు పట్టణాల్లో లాక్ డౌన్ నిబంధనలను కఠినతరం చేస్తున్నారు. అధికారులు అత్యవసరం కాని వ్యాపార సంస్థల కార్యకలాపాలను నియంత్రించటం, ప్రజలను అనవసరంగా వీధులలోకి రాకుండా హెచ్చరికలు జారీ చేయడం కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో, మద్యం దుకాణాలను మూసివేయటం కూడా చాలా అవసరం. మద్యం దుకాణాల వద్ద ఎటువంటి నిబంధనలను పాటించటంలేదు. అమలు చేయటం కూడా కష్టమే. అందువల్ల కొంతకాలం పాటు మద్యం దుకాణాలను మూసివేస్తే వ్యాధి వ్యాప్తిని కొంతమేరకు నిరోధించగలుగుతాం. 

గరిమెళ్ళ రామకృష్ణ, ఏలూరు

Advertisement
Advertisement
Advertisement