Advertisement
Advertisement
Abn logo
Advertisement

టాంజానియన్ల లిప్‌ సింక్‌ సాంగ్‌కు నెటిజన్లు ఫిదా!

బాలీవుడ్‌ పాటలకు లిప్‌ సింక్‌ సాంగ్స్‌ క్రియేట్‌ చేసి ఇన్‌స్టాలో పెడుతూ దుమ్మురేపుతున్నారు టాంజానియాకు చెందిన అన్నాచెల్లెళ్లు.  ఇటీవలే వీళ్లు ‘షేర్షా’ మూవీలోని ‘రాతన్‌ లంబియా..’ అనే పాటకు లిప్‌ సింక్‌ వీడియో క్రియేట్‌ చేసి ఇన్‌స్టాలో పోస్టు చేశారు. ఈ ఒక్కపాటతో అన్నాచెల్లెళ్లు రాత్రికి రాత్రే భారతీయులకు స్టార్లుగా మారిపోయారు. టాంజానియాకు చెందిన కిలీ, నీమాలకు బాలీవుడ్‌ పాటలంటే ఇష్టం. కిలీకి టిక్‌టాక్‌ స్టార్‌గా గుర్తింపు ఉంది. టిక్‌టాక్‌పై నిషేదం ఉండటంతో ఇన్‌స్టాలో వీడియోలు పెడుతున్నాడు. ఇటీవలే ఇన్‌స్టాలో బాలీవుడ్‌ సాంగ్‌కు లిప్‌ సింక్‌ చేసి పోస్టు చేయడంతో ఇన్‌స్టాలోనూ ఫాలోవర్స్‌ సంఖ్య అమాంతం పెరిగింది. ఐదురోజుల్లోనే వీళ్లు పోస్టు చేసిన పాట పది లక్షల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. భాష తెలికపోయినా వీళ్లు చేసిన లిప్‌ సింక్‌ వీడియోకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. ఒకపాట కోసం వీళ్లు పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. పర్‌ఫెక్షన్‌ కోసం చాలా సమయం తీసుకుంటారు. ‘‘ముందుగా పాటను ఎంపిక చేసుకుంటాం. తరువాత యూట్యూబ్‌లో చూసి లిరిక్స్‌ సేకరిస్తాం. తరువాత గూగుల్‌లో ఒక్కోపదాన్ని ఎలా పలకాలో నేర్చుకుంటాం. ఒక్క పదాన్ని కూడా మిస్‌ చేయం. వాటి అర్థం కూడా తెలుసుకుంటాం. ఎందుకంటే ఎక్స్‌ప్రెషన్స్‌ ఇవ్వాలంటే అర్థం తెలియాలి. ఆ తరువాత ప్రాక్టీస్‌ చేసి రికార్డు చేస్తాం’’ అని చెప్పుకొచ్చారు కిలీ. లిప్‌ సింక్‌ సాంగ్‌కు వచ్చిన ఆదరణ చూసి ఉబ్బితబ్బిబవుతున్నారు ఈ అన్నాచెల్లెళ్లు. ‘‘భారతీయుల ప్రేమ చాలా స్వచ్ఛమైంది. దీన్ని ఎలా వివరించాలో ఎలా అర్థం కావడం లేదు’’ అని తన ఆనందాన్ని పంచుకున్నాడు కిలీ. రాతన్‌ లాంబియాన్‌ పాట వైరల్‌ కావడంతో షారుక్‌ఖాన్‌ ‘రాయిస్‌’ సినిమాలోని జలీమా పాటకు లిప్‌ సింక్‌ చేసి పోస్టు చేశారు. 

Advertisement
Advertisement