Abn logo
Apr 22 2021 @ 04:42AM

రాష్ట్రంలో 4 రోజులు తేలికపాటి వర్షాలు

అమరావతి/విశాఖపట్నం, ఏప్రిల్‌ 21(ఆంధ్రజ్యోతి): ఉత్తర-దక్షిణ ద్రోణి ఉత్తర మధ్య కర్ణాటక నుంచి దక్షిణ తమిళనాడు వరకు వ్యాపించి ఉంది. ఇది సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడింది. దీని ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా రానున్న నాలుగు రోజులు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖ, అమరావతి వాతావరణ కేంద్రాలు తెలిపాయి. కాగా, దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమలో బుధవారం ఎండ తీవ్రంగా ఉంది. పలుచోట్ల వర్షాలు కురిశాయు. బలికురవ, మర్రిపాడు, చంద్రగిరి, ఉదయగిరి, సిద్ధవటం, మహానంది, సింగనమలలో 41-42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో బయట సెగ, ఇంట్లో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఉత్తరకోస్తాంధ్రలో ఎండ తీవ్రత తగ్గినా, ఆకాశం మేఘావృతమై, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరికి గురయ్యారు.  

Advertisement
Advertisement
Advertisement