May 9 2021 @ 11:12AM

ఆ విష‌యంలో గ్యారంటీ ఇచ్చిన ‘లైగ‌ర్’ .. టీజ‌ర్ వాయిదా

అభిమానులు ఆప్యాయంగా రౌడీ అని పిలుచుకునే హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ పుట్టిన‌రోజు ఆదివారం(మే 9). ఈ సంద‌ర్భంగా త‌ను న‌టిస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘లైగ‌ర్’ నుంచి టీజ‌ర్ విడుద‌ల‌వుతుంద‌ని అభిమానులు ఆస‌క్తిగా ఎదురు చూశారు. అయితే ‘లైగ‌ర్’ యూనిట్ ప్ర‌స్తుతం దేశంలో నెల‌కొన్న కొవిడ్ సెకండ్ వేవ్ ప‌రిస్థితుల్లో టీజ‌ర్‌ను విడుద‌ల చేయ‌లేమ‌ని ప్ర‌క‌ట‌న‌న‌ను విడుద‌ల చేసింది. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో ఎవ‌రూ బ‌య‌ట‌కు రాకుండా వారితో పాటు వారిని అభిమానించే వారిని జాగ్ర‌త్త‌గా చూసుకోవాల‌ని చిత్ర యూనిట్ కోరింది. టీజ‌ర్ విడుద‌ల చేయాల‌ని అనుకున్న‌ప్ప‌టికీ ప‌రిస్థితులు అనుకూలంగా లేక‌పోవ‌డంతో వాయిదా వేశామ‌ని చెప్పిన నిర్మాత‌లు..త‌ప్ప‌కుండా టీజ‌ర్ అభిమానుల‌ను మెప్పిస్తుంద‌ని, విజ‌య్ దేవ‌ర‌కొండ‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చూడ‌నటువంటి పాత్ర‌లో చూస్తార‌ని తెలిపారు. పూరీ జగన్నాథ్ దర్శకుడు. కరణ్ జోహార్, పూరి, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.