Abn logo
Sep 12 2020 @ 20:37PM

అత్యాచారాన్ని జాతీయ ఎమర్జెన్సీగా ప్రకటించిన లైబీరియా!

Kaakateeya

మన్రోవియా: పశ్చిమ ఆఫ్రికా దేశమైన లైబీరియా అత్యాచారాన్ని జాతీయ అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు జార్జ్ వీ సంచలన ప్రకటన చేశారు. దేశంలో ఇటీవల అత్యాచార కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుండడంతో వాటిని అరికట్టేందుకు సరికొత్త చర్యలు ప్రకటించారు. రాజధాని మన్రోవాలో గత నెలలో అత్యాచార కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో వేలాదిమంది ఆందోళనకు దిగారు.


నిరసనలతో దిగొచ్చిన అధ్యక్షుడు జార్జ్ వీ అత్యాచారాన్ని జాతీయ అత్యవసర స్థితిగా ప్రకటించారు. దేశంలో అత్యాచార కేసులను విచారించేందుకు ప్రత్యేక ప్రాసిక్యూటర్‌ను ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. అలాగే, జాతీయ లైంగిక నేరస్తుల జాబితాను ఏర్పాటు చేస్తామన్నారు. దీంతోపాటు లైంగిక, లింగ ఆధారిత హింసపై నేషనల్ సెక్యూరిటీ టాస్క్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. 

Advertisement
Advertisement
Advertisement