Abn logo
Sep 26 2021 @ 00:44AM

దీన్‌దయాళ్‌ ఆశయాలను కొనసాగిద్దాం

మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ

ధర్మవరం, సెప్టెంబరు 25: జనసంఘ్‌ పార్టీ వ్యవస్థాపకుడు పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని మాజీ ఎమ్మెల్యే గోనుగుం ట్లసూర్యనారాయణ పేర్కొన్నారు. ఈ  మేరకు ఆయన వ్యక్తిగత కార్యాలయంలో శనివారం  దీన్‌దయాళ్‌ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన సేవల గురించి వివరించారు. అనంతరం ఆయన ఆశయాలను  ప్రతి ఒక్కరూ కొనసాగించాలని ఆయన సూచించారు. అనంతరం కార్యకర్తలను ఆప్యాయంగా పలుకరిస్తూ నియోజకవర్గ సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు డిష్‌రాజు, చిగిచెర్ల అరవిం దరెడ్డి, పామిశెట్టి శివశంకర్‌, టీడీపీ శీన, దుస్సాక్రిష్ణ, రాప్తాటిరాము, గొట్లూరుచంద్ర, బోడగల గిరిధర్‌, పరమేశ్‌, నిరంజన్‌యాదవ్‌, నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.

ముదిగుబ్బ: మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో డాక్టర్‌ పండిట్‌ దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ  జయంతిని బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర క్యావర్గసభ్యుడు సోమల ప్రకాశ్‌, కన్వీనర్‌ నారాయణస్వామి, ప్రఽధాన కార్యదర్శి పసుపులేటి వెంకటేశ్‌, మైనార్టీ మోర్చా చాంద్‌బాషా, మర్తాడుసత్తి, సూరి, వెంకటరాముడు పా ల్గొన్నారు.