Abn logo
Sep 26 2021 @ 00:57AM

క లిసి నడుద్దాం.. చంద్రబాబును సీఎం చేద్దాం : జేసీపీఆర్‌

కార్డులను చూపుతున్న జేసీ ప్రభాకరరెడ్డి, ఇతర టీడీపీ నాయకులు


అనంతపురం వైద్యం, సెప్టెంబరు 25: ‘విభేదాలు వద్దు.. క లిసి కష్టపడి పనిచేద్దాం. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చే సుకుందాం’ అని తాడిపత్రి ము న్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి సూచించారు. శనివారం ఆయన నగరంలోని లక్ష్మినగర్‌ నివాసంలో తమ వర్గం టీడీపీ నాయకులతో కలిసి ‘కష్టపడుదాం - చంద్రబాబు ను సీఎంను చేసుకుందాం’ అన్న నినాదంతో ముద్రించిన కార్డులను విడుదల చేశారు. అనంతరం ఆత్మీయ పలకరింపు పేరుతో న్యాయవాది విజయకుమార్‌, మాజీ కౌన్సిలర్‌ ఉంగరాల శీను, భాస్కర్‌నాయుడు, చరణ్‌, సంజీవ్‌నాయుడు ఇళ్లకు వెళ్లి పలకరించారు. పార్టీ కోసం మనందరం కలిసి పనిచేద్దామని కోరారు. కార్యక్రమంలో చంద్రదండు ప్రకా్‌షనాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శులు బుగ్గయ్యచౌదరి, జేఎల్‌ మురళీధర్‌, నాయకులు రాయల్‌మురళి, కృష్ణకుమార్‌, వెంకటాద్రి, లక్ష్మినరసింహా, గుత్తా ధనుంజయనాయుడు, శ్రీకాంత, హేమంత, అనిల్‌, సునిల్‌, రఫీ పాల్గొన్నారు. 

అగళి జడ్పీటీసీని అభినందించిన జేసీపీఆర్‌

మడకశిర నియోజకవర్గం అగళి మండల జడ్‌పీటీసీగా టీడీపీ తరపున గెలుపొందిన ఉమేశ శనివారం జేసీ ప్రభాకర్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా ఉమే్‌షను జేసీపీఆర్‌ అభినందించారు.