Abn logo
Oct 24 2020 @ 17:45PM

‘చావు క‌బురు చ‌ల్ల‌గా’.. లావణ్య లుక్‌ వచ్చేసింది

Kaakateeya

అందాల రాక్ష‌సి చిత్రంతో ఆకట్టుకుని మంచి పేరు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి.. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్‌గా మారిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె నటిస్తున్న రెండు మూడు చిత్రాలు సెట్స్‌పై ఉన్నాయి. అందులో ఒక చిత్రమైన 'చావు క‌బురు చ‌ల్ల‌గా' చిత్రంలోని ఆమె లుక్‌ని శనివారం చిత్రయూనిట్‌ విడుదల చేసింది. మల్లికగా ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి నటిస్తున్నట్లుగా చిత్రయూనిట్‌ ప్రకటించారు. మ‌ల్లికగా మొద‌టి లుక్‌లోనే ఆకర్షిస్తున్న లావణ్య.. ఈ చిత్రంలో బ‌స్తీ బాల‌రాజు అదే కార్తికేయతో జోడీ కడుతోంది. మెగా ప్రొడ్యూస‌ర్  అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో వ‌రస విజయాలతో దూసుకుపోతోన్న ‌బన్నీ వాసు నిర్మాత‌గా.. ఎన‌ర్జిటిక్ యంగ్ హీరో కార్తీకేయ‌, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా నూత‌న ద‌ర్శ‌కుడు కౌశిక్ పెగ‌ళ్ల‌పాటి తెర‌కెక్కిస్తున్న చిత్రం 'చావు క‌బురు చ‌ల్ల‌గా'. ఈ చిత్రం నుంచి ‌మ‌ల్లికగా చాలా న్యాచురల్‌గా లావణ్య త్రిపాఠి లుక్‌ని విడుదల చేసిన చిత్రయూనిట్‌.. ఈ చిత్రంలో ఆమె పాత్ర కూడా అంతే న్యాచురల్‌గా ఉంటుందని చిత్రయూనిట్‌ తెలుపుతోంది. సునీల్ రెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు.. జకీస్ బీజాయ్ సంగీతం అందిస్తున్నారు.

లావణ్య లుక్‌ విడుదల సందర్భంగా నిర్మాత బ‌న్నీ వాసు మాట్లాడుతూ.. ''జిఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌లో భ‌లేభ‌లే మ‌గాడివోయ్‌, గీత గోవిందం, ప్ర‌తిరోజూ పండ‌గే చిత్రాలు ఘ‌న‌ విజయాలు సాధించాయి. అలాంటి బ్యాన‌ర్‌లో వ‌చ్చే ప్ర‌తి చిత్రంపై ప్రేక్ష‌కుల‌కి అంచ‌నాలు ఉంటాయి. వారిని దృష్థిలో పెట్టుకుని చిత్రాలు నిర్మిస్తున్నాం. కార్తికేయ గ‌త చిత్రాలకి ఈ చిత్రం పూర్తి భిన్నంగా ఉండాలి అనుకున్నాం. అందుకే బస్తీ బాల‌రాజుగా టీజ‌ర్‌లో చూపించాం. అలానే ఇప్పుడు లావ‌ణ్య త్రిపాఠిని మ‌ల్లికగా ప‌రిచ‌యం చేశాం. మా మ‌ల్లిక పోస్ట‌ర్ చూసిన వారంతా చాలా బాగుందని ప్రశంసిస్తున్నారు. ఈ చిత్రంలో త‌న పాత్ర ప్ర‌తి ఒక్క‌రికీ గుర్తుండిపోతుంది. ద‌‌ర్శ‌కుడు కౌశిక్ కొత్త‌వాడైనా చాలా టాలెంట్ ఉన్న‌వాడు. చెప్పిన పాయింట్ చాలా కొత్త‌గా అనిపించింది. ఇది రెగ్యుల‌ర్ సినిమా కాదు అని మాత్రం ఖ‌చ్చితంగా చెప్ప‌గ‌ల‌ను. ఈ చిత్రం అంద‌ర్ని ఆక‌ట్టుకుంటుంది.." అని అన్నారు.


Advertisement
Advertisement