Advertisement

కమల్‌హాసన్ ఆరోగ్యంపై తాజా హెల్త్ బులెటిన్

లోకనాయుకుడు కమల్‌హాసన్ ఇటీవల కోవిడ్ బారిన పడిన సంగతి తెలిసిందే. నవంబర్ 22న ఆయన చెన్నైలోని రామచంద్ర మెడికల్ సెంటర్ లో చికిత్సకై జాయిన్ అయ్యారు. ఆయనకి మైల్డ్ గా కోవిడ్ అటాక్ అయిందని డాక్టర్స్ తెలిపారు. అప్పటి నుంచి ఆయన చికిత్సలో ఉన్నారు. తాజాగా  కమల్ హాసన్ హెల్త్ కండీషన్ పై బులెటిన్ విడుదల చేసింది రామచంద్ర మెడికల్ సెంటర్. ఆయన కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకున్నారని ఆసుపత్రి యాజమాన్యం తెలిపింది. కానీ డిసెంబర్ 3 వరకూ ఐసోలేషన్ లో ఉండాలని, డిసెంబర్ 4 నుంచి ఆయన యధావిధిగా తన పనులు చేసుకోవచ్చని తెలిపింది.


Advertisement