Advertisement
Advertisement
Abn logo
Advertisement

లారీ ఢీకొని బాలుడి దుర్మరణం

తిరుచానూరు, డిసెంబరు 2: తిరుపతిరూరల్‌ మండలం ఓటేరు వద్ద జాతీయ రహదారిపై సైకిల్‌పై వెళ్తున్న భార్గవ్‌(11)ను లారీ ఢీకొనడంతో దుర్మరణం చెందాడు. తిరుచానూరు ఎస్‌ఐ వీరేష్‌ తెలిపిన ప్రకారం.. దామినేడు ఎన్టీఆర్‌ గృహ సముదాయంలో దిలీ్‌పకుమార్‌ కుటుంబీకులు నివాసం ఉంటున్నారు. ఇతడి కుమారుడు భార్గవ్‌ వారం కిందట ఓటేరులోని పెద్దమ్మ ఇంటికి వెళ్లాడు. గురువారం మధ్యాహ్నం వేదాంతపురం సర్కిల్‌నుంచి బైపాస్‌ రోడ్డులో సైకిల్‌పై వస్తుండగా ఓటేరు సమీపంలో లారీ ఢీకొంది. తీవ్రంగా గాయపడిన ఇతడు సంఘటనా స్థలంలోనే మృతిచెందాడు. స్థానికుల సమాచారంతో ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు.. లారీ డ్రైవరును అదుపులోకి తీసుకున్నారు. భార్గవ్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా మార్చురీకి తరలించి, కేసు నమోదు చేశారు. 

Advertisement
Advertisement