Abn logo
May 26 2020 @ 03:18AM

డ్రగ్స్‌ కేసులో లంక క్రికెటర్‌ అరెస్టు

కొలంబో: మాదక ద్రవ్యాల కేసులో శ్రీలంక అంతర్జాతీయ క్రికెటర్‌ షెహన్‌ మదుషంకను పోలీసులు అరెస్టు చేశారు. కర్ఫ్యూ సమయంలో కారులో వెళ్తుండగా ఆపి తనిఖీలు చేయగా.. అతడి వద్ద రెండు గ్రాముల హెరాయిన్‌ లభించినట్టు పోలీసులు తెలిపారు. అతడితోపాటు మరో వ్యక్తి కూడా ఉన్నట్టు చెప్పారు. 2018లో అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం మ్యాచ్‌లోనే మదుషంక హ్యాట్రిక్‌తో సంచలనం సృష్టించాడు. 

Advertisement
Advertisement
Advertisement