Abn logo
Dec 5 2020 @ 01:33AM

25న పేదలందరికీ ఇళ్ల స్థలాల అందజేత

  • జేసీ కీర్తి.. వాలుతిమ్మాపుంలో టిడ్కో  ఇళ్లు, సూరంపాలెం రహదారిలో ఇళ్ల స్థలాల పరిశీలన

పెద్దాపురం, డిసెంబరు 4: పేదలందరికీ ఇళ్ల స్థలాలను, టిడ్కో ఇళ్లను ఈనెల 25న అందజేయనున్నట్టు జేసీ కీర్తి చేకూరి పేర్కొన్నారు. పట్టణ పరిధిలో ఉన్న వాలుతిమ్మాపురం శివారులో టిడ్కో ఇళ్లను, సూరంపాలెం రహదారిలో ఉన్న ఇళ్ల స్థలాలను ఆమె శుక్రవారం పరిశీలించారు. ఈనెల 25న ఫేజ్‌-2కు సంబంధించి 1729 ఇళ్లకుగాను 300 మందికి అందజేస్తామని, పూర్తిస్థాయిలో వసతులు కల్పిస్తామని చెప్పారు. సూరంపాలెంలో 57 ఎకరాల్లో 2059 మంది లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను అందజేయనున్నట్టు చెప్పారు. స్థలాలకు సంబంధించిన జియో ట్యాగింగ్‌ను పరిశీలించి ఆమె సంతృప్తి వ్యక్తంచేశారు. కార్యక్రమంలో టిడ్కో ఈఈ రీటా, మున్సిపల్‌ కమిషనర్‌ సురేంద్ర, మున్సిపల్‌ డీఈ ఆదినారాయణ, టీపీఎస్‌ శేషగిరి, ఏఈ శ్రీలక్ష్మీ, శానిటరీ ఇనస్పెక్టర్‌ దావీదురాజు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
Advertisement