Abn logo
Sep 21 2021 @ 23:25PM

భూముల రీ సర్వే వేగవంతం చేయాలి

ఎల్‌.ఎన్‌.పేట: గ్రామాల్లో చేపడుతున్న భూముల రీసర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా సర్వే, భూరికార్డుల అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కె.ప్రభాకర్‌ ఆదేశించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో మంగళవారం గ్రామసచివాలయ సర్వేయర్లతో సమావేశం నిర్వహించారు.  రీసర్వే ప్రకారం రికార్డులను పక్కాగా తయారు చేసేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో మండల సర్వేయర్‌ జి.గవరయ్య, తదితరులు పాల్గొన్నారు.