Abn logo
Jul 11 2020 @ 05:39AM

సోలార్‌ ప్రాజెక్టుకు భూసమస్య

 ప్రత్యామ్నాయం చూద్దామన్న కలెక్టర్‌ భాస్కర్‌ 

 అక్కడే వేగంగా నిర్మాణం జరగాలన్న మంత్రి బాలినేని 

 రైతులతో సంప్రదింపులు చేస్తున్న ఎమ్మెల్యే మద్దిశెట్టి


ఒంగోలు, జూలై 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఏర్పాటు చేయాలని భావిస్తున్న సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టుకు భూసమస్య ఎదురైంది. దీంతో ప్రత్యామ్నాయ స్థలా న్ని ఎంపిక చేయాలన్న ఆలోచనకు కలెక్టర్‌ రాగా, తొలుత ప్రతిపాదించిన ప్రాం తంలోనే స్థల సేకరణ పూర్తి చేసి వేగంగా పనులు ప్రారంభించాలని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. రైతుల నుంచి ఎదురవుతున్న సమస్య పరి ష్కార బాధ్యతను దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌కు అప్పగించారు. అ యితే రైతుల డిమాండ్‌, ప్రభుత్వం చెప్పే పరిహార చర్యల మధ్య వ్యత్యాసం అధికంగా ఉండటంతో అనుకున్న ప్రకారం ప్రారంభమవుతాయా? లేదా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. 


జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి విద్యుత్‌శాఖ మంత్రిగా ఉండటంతో సోలార్‌ ప్రాజెక్టు ఏర్పాటుకు జిల్లాకు ప్రాధాన్యం ఇచ్చారు. వెయ్యి మెగావాట్ల ప్రాజెక్టును దొనకొండ మండలంలోనూ, ఆ తర్వాత మరో 500 మెగావాట్ల ప్రా జెక్టును సీఎస్‌పురం వద్ద, మరో వెయ్యి మెగావాట్ల ప్రాజెక్టును కంభం వద్ద ఏర్పాటు చేయాలని భావించారు. అందులో భాగంగా దొనకొండ మండలంలోని రుద్రసముద్రం, మంగినపూడి, భూమనపల్లి గ్రామాల వద్ద ఉన్న ప్రభుత్వ భూ మిలో వెయ్యి మెగావాట్ల ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన చేపట్టాలని నిర్ణయిం చారు. ఆ మూడు గ్రామాల పరిధిలోని ఐదు వేల ఎకరాల్లో ఈ ప్రాజెక్టును సత్వరం ప్రారంభించాలని భావించి అవసరమైన భూసేకరణ కూడా చేశారు. రేపోమాపో పనులకు శంకుస్థాపన చేయాలన్న ఉద్దేశంతో మంత్రి బాలినేని అధికారులపై ఒత్తిడి పెంచారు. 


కలెక్టర్‌ చర్యల కారణంగా..

అంతా సాఫీగా ఉందనుకుంటున్న దశలో గత నెలలో కలెక్టర్‌ పోలా భాస్కర్‌ ఆ ప్రాంతంలో రైతులతో సమావేశం నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధు లెవ్వరూ లేకుండా కలెక్టర్‌ అక్కడికి వెళ్లడంతో రైతులు దశాబ్దాలుగా తమ సాగులో ఉన్న భూమిని వదులుకునేది లేదని, ప్రాజెక్టు ఏర్పాటును ప్రతిఘటి స్తామని హెచ్చరించారు. కలెక్టర్‌ నచ్చచెప్పినా వారు వినలేదు. దీంతో మరో ప్రాంతంలో భూములు చూద్దామని, ప్రాజెక్టు నిర్మాణ పనుల ప్రారంభాన్ని వాయిదా వేసుకోవాలని కలెక్టర్‌ మంత్రి బాలినేనికి సూచించినట్లు తెలిసింది.


దీనిపై తీవ్ర అసంతృప్తికి గురైన బాలినేని ఎట్టి పరిస్థితుల్లో వెంటనే పనులు ప్రారంభించాలని, రుద్రసముద్రం వద్దే భూములను ఎంపిక చేయాలని స్పష్టం చేసి తన వంతు ప్రయత్నాలకు శ్రీకారం పలికారు. స్థానిక ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌ను పిలిపించుకొని, విషయాన్ని తెలియజేసి మీరెందుకు జోక్యం చేసుకోలేదని ప్రశ్నించినట్లు తెలిసింది. కలెక్టర్‌ తనకు తెలియకుండా అక్కడికి వెళ్లి దుందుడుకుగా వ్యవహరించంతో సమస్య వచ్చిందని ఆయన మంత్రికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆ వెంటనే మద్దిశెట్టి ఆ ప్రాంతవాసులతో ఫోన్‌లో మాట్లాడి రైతులకు కూడా ఇబ్బందిలేని విధంగా మార్గం ఆలోచిద్దామని, వేరే ప్రాంతానికి తరలించవద్దని మంత్రిని కోరారు. రెండ్రోజుల క్రితం రుద్రసము ద్రంలో మూడు గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు. మొత్తం అవస రమైన భూమిలో 500 ఎకరాలకు సంబంధించి మాత్రమే సమస్య ఉందని, ఆ భూమి సాగుదారులకు ఏడాదికి రూ. 25వేలు కౌలు ఇప్పిస్తామని, అందుకు సమ్మతించాలని సూచించారు. అదే ప్రతిపాదనను మంత్రి బాలినేని దృష్టికి తీసుకెళ్లారు. సీఎంతో మాట్లాడి  న్యాయం చేయాలని కోరారు.


ఒంగోలుకు వచ్చిన రైతులు

 రైతులు ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాలని, అప్పటి వరకూ కౌలు ఎక రాకు రూ.50వేలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తున్నారు. తదనుగుణంగా వంద లాది మంది రైతులు మంత్రిని కలవాలన్న ఉద్దేశంతో శుక్రవారం ఒంగోలు వ చ్చారు. మంత్రి విజయవాడలో ఉండటంతో కొంతమంది అధికారులను కలి శారు. న్యాయపరమైన అంశాలను కూడా వారు పరిశీలిస్తున్నట్లు తెలిసింది.


దీంతో యంత్రాంగం మరింత వేగంగా స్పందించి ఆ మొత్తం భూమి అసైన్డ్‌ కావడం వలన ప్రభుత్వ సూచనలకు మీరు అంగీకరిస్తే సరి, లేకుండా మీరు నష్టపోతారని రైతులకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. మొత్తం ఐదు వేల ఎకరాల్లో కేవలం 500 ఎకరాలకు సంబంధించి మాత్రమే సాగులో ఉన్న రైతు లు నష్టపోయే అవకాశం ఉన్నందున వారికి న్యాయం చేసి ప్రాజెక్టును అక్కడే ఉంచాలని ఎమ్మెల్యే మద్దిశెట్టి మంత్రి బాలినేనితోపాటు, సీఎం పేషీ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో సోలార్‌ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం విజయవాడలో ప్రత్యేక కార్యాలయం ప్రారంభమైనందున ఈ భూసమస్యను త్వరితగతిన పరిష్కరించాల్సిన అవసరం ఏర్పడింది. 

Advertisement
Advertisement
Advertisement