Advertisement
Advertisement
Abn logo
Advertisement

భూసేకరణ పనులు వేగవంతం చేయాలి

 జిల్లా  కలెక్టర్‌ ఎ .మల్లికార్జున

విశాఖపట్నం, డిసెంబరు 2: వివిధ అభివృద్ధి పనులకు సంబంధించి చేపట్టాల్సిన భూసేకరణ (ల్యాండ్‌ ఎక్విజి షన్‌) ప్రక్రియ తక్షణం పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున అధికారు లను ఆదేశించారు. కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఏపీఐఐసీఆర్‌ అండ్‌ ఆర్‌ఎన్‌హెచ్‌ 16, ఎన్‌ఏవోబీ, పాడేరు గ్రీన్‌కారిడార్‌ అధికారులతోపాటు పాడేరు సబ్‌ కలెక్టర్‌, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీవోలతో  గురువారం వీడియో కాన్ఫ రెన్స్‌ నిర్వహించారు.


ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ భూ సంబంధిత పనులు, రోడ్ల అభివృద్ధి, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పను లను సత్వరం పూర్తి చేయాలని ఆదేశించారు. పాడేరు పరిధిలో అటవీ శాఖ అధికారులతో ఎదు రవుతున్న ఇబ్బందులను చర్చించి పరిష్కరించా లన్నారు.


ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం భూ ములు, పంట భూములు, చెట్లకు పపరిహారం అందించి పనులు పూర్తిచేయాలని ఆదేశించారు. జాతీయ రహదారినిర్మాణం ప్రాధాన్యతను గుర్తిం చాలని సూచించారు. జెట్టీ నిర్మాణానికి మత్స్య శాఖ జేడీతో మాట్లాడి సమస్య పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో జేసీ ఎం.వేణుగోపాలరెడ్డి, డీఆర్‌వో శ్రీనివాసమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement