Abn logo
Sep 28 2020 @ 14:50PM

ప్రాణాలకు తెగించి కొవిడ్‌ విధులు నిర్వహించాం.. మాకు న్యాయం చేయండి

Kaakateeya

కడప: మే నెలలో ల్యాబ్‌ టెక్నీషియన్లుగా కాంట్రాక్ట్‌ పద్ధతిలో నియమించారు. ప్రస్తుతం కొత్త నోటిఫికేషన్‌ పేరుతో మమ్మల్ని తొలగించే కుట్ర జరుగుతోందని మాకు న్యాయం చేయాలంటూ ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఒంటి పై కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఆదివారం డీఎంహెచ్‌ వో కార్యాలయం వద్ద తమకు న్యాయం చేయాలని వారు ఆందో ళన చేశారు. అధికారులు వారిని పట్టించుకోకపోవడంతో బ్రహ్మయ్య అనే ల్యాబ్‌ టెక్నీషియన్‌ కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్యాయత్యానికి యత్నించాడు. వెంటనే అక్కడున్న వా రు అతడిని అడ్డుకున్నారు.


ఈ సందర్భంగా ల్యాబ్‌ టెక్నీషియన్లు నాగరాజు, ముబీనా, సుధాకర్‌ నాయక్‌ మాట్లాడుతూ ప్రభుత్వం నోటిఫికేషన్‌ ద్వారా 25 మందిని నియమిం చి ప్రాథమిక ఆసుపత్రులకు కేటాయించా రని, అయితే 3 రోజుల తరువాత కొవిడ్‌ విధులు నిర్వహించాలంటూ అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయని తెలిపారు. కొవిడ్‌ కష్టకాలంలో తాము భార్య, భర్త, పిల్లలకు దూరంగా ఉంటూ రేయింబవళ్లు పనిచేశామని తెలిపారు. ఇపుడు జిల్లా వైద్య శాఖాధికారులు ఆగమేఘాల మీద నోటిఫికేషన్‌ విడుదల చేసి 30 మందిని నియమించేలా ఆదివారం సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌  చేపట్టారని తెలిపారు. కొత్తగా నియమించే వారిని కూడా తాము పనిచేసే పీహెచ్‌సీల్లో నియమించేలా అధికారులు నిర్ణయం తీసుకున్నారనీ, తమ పరిస్థితి గాలిలో దీపంలా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలిసీ డీఎంహెచ్‌వోను అడగ్గా బెదిరింపులకు దిగడమే కాకుండా ఆందోళనకు దిగితే మీ ఉద్యోగాలు తొలగిస్తామని, వచ్చే ఏడాది రెన్యువల్‌ చేయమంటూ హెచ్చరిస్తున్నారని, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. 


ప్రభుత్వ నిబంధనల మేరకు తదుపరి చర్యలు

ల్యాబ్‌ టెక్నీషియన్లుగా మే నెలలో ఎంపికైన 25 మంది ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఏడాది కాల పరిమితితో నియమించిన విధంగా జీతభత్యాల చెల్లింపులు జరుగుతుందని డీఎంహెచ్‌వో డాక్టర్‌ అనిల్‌కుమార్‌ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పీహెచ్‌సీల్లో ఖాళీగా ఉన్న ఎల్‌టీసీలు-2లతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న 25 ఎల్‌టీసీలకు మే నెలలో నోటిఫికేషన్‌ జారీ చేశామన్నారు. వారికి ఈనెల 27వ తేదీ కౌన్సెలింగ్‌ జరుగుతుండడంతో కొవిడ్‌ విధులకు నియమించిన ల్యాబ్‌ టెక్నీషియన్లు ఆందోళనకు దిగారన్నారు. వారి కాంట్రాక్ట్‌ కాల పరిమితి తరువాత ప్రభుత్వ నిర్ణయంపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 



Advertisement
Advertisement
Advertisement