Abn logo
Sep 29 2020 @ 21:41PM

అనారోగ్యంతో కువైట్ రాజు మృతి!

Kaakateeya

గల్ఫ్ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి: కువైట్ రాజు సభా అల్ అహ్మద్ అల్ సభా(91) అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. ఆయన మరణించినట్టు కొద్ది గంటల క్రితం ప్రభుత్వ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. గత కొద్ది నెలల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న సభా అల్ అహ్మద్ ఇటీవల సర్జరీ కూడా చేయించుకున్నారు. ఆయనకు అమెరికాలో చికిత్స అందించేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రత్యేక ఎయిర్ ఫోర్స్ విమానాన్ని సైతం ఏర్పాటు చేశారు. చికిత్స కోసం జూలై నెలలో అమెరికాకు వెళ్లిన ఆయన ఈ నెల మొదట్లో తిరిగి కువైట్‌ చేరుకున్నారు. 

సభా అల్ అహ్మద్ 2006 నుంచి కువైట్‌ను పాలిస్తున్నారు. గత 14 ఏళ్ల నుంచి ఆయన కువైట్ రాజుగా ఉన్నప్పటికి.. 50 ఏళ్లకు పైగా కువైట్ ప్రభుత్వంలో ఆయన కీలక పాత్ర పోషించారు. అమెరికా మిత్రదేశాలలో కువైట్‌ను ప్రధాన దేశంగా చేయడంలో సభా అల్ అహ్మద్ కీలకంగా వ్యవహరించారు. ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిష్టాత్మకమైన మిలిటరీ అవార్డును సైతం ఇటీవల సభా అల్ అహ్మద్‌కు ప్రదానం చేశారు. కాగా.. సభా అల్ అహ్మద్ గతంలో మూడు సార్లు భారత పర్యటనకు వచ్చారు.

Advertisement
Advertisement
Advertisement