Advertisement
Advertisement
Abn logo
Advertisement

కువైట్‌లో తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగ కార్తీకమాస వనభోజనాలు!

కరోనా సంక్షోభం అనంతరం మొట్టమొదటి సారిగా కువైట్‌లో ఇరు రాష్ట్రాలకు చెందిన దాదాపు రెండు వందల యాభై తెలుగు కుటుంబాలు కార్తీక మాస వనభోజన కార్యక్రమ౦లో పాల్గొన్నారు. ఉదయం 8.౩౦ నుండి 9.30 గంటల వరకు విచ్చేసిన పెద్దలు, పిల్లలు అంతా అల్పాహారం సేవించి, ఆనందోత్సవాల నడుమ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తదనంతరం 10.00 గంటల నుండి పిల్లలు, పెద్దలు , జంటలు అందరు ఆటపాటలలో ఉత్సాహంగా గడిపేందుకు వీలుగా TKS కార్యవర్గం విన్నూత్నమైన గేమ్స్‌ను అద్భుతంగా డిజైన్ చేసింది. బాల్ వాకింగ్, బాల్ పాసింగ్ ,స్క్విడ్ గేమ్, సింగల్ లెగ్ రేస్, త్రో బాల్, కోకో, డాడ్జ్ బాల్, మ్యూజికల్ చైర్స్, వన్ మినిట్ గేమ్, బ్యాంగిల్స్ & స్ట్రాస్, మాల్ విత్ మ్యూజిక్, వాలీ బాల్, క్రికెట్, టగ్ అఫ్ వార్ వంటి అన్ని ఆటల్లోనూ అక్కడి వారు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. 

మధ్యహ్నాం 1.00లకు భోజనాల తరువాత మళ్లీ ఆటపాటల కోలాహలం ప్రారంభమైంది. వరద బాధితుల సహాయార్థం తెలుగు కళాసమితి కువైట్ విరాళాలను సేకరించేందు సిద్ధమయ్యారు. 2.30 గం'లకు తెలుగు కళాసమితి కార్యవర్గ అధ్యక్షులు శ్రీ సాయి సుబ్బారావు గారు ప్రసంగిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి వారి కృతజ్ఞతలు తెలిపారు. తదనంతరం తెలుగు కళాసమితి కార్యవర్గం కమిటీని ఆహ్వానిస్తూ వారి సేవలను కొనియాడారు. 3.00 గం'లకు హౌసీ, లక్కీ డిప్ కార్యక్రమాల్లో పిన్న, పెద్ద ఎంతో ఉత్సాహంగా పాల్గొని ఆకర్షణీయమైన బహుమతులు గెలుచుకున్నారు. 

3.30 గంటలకు స్పోర్ట్స్ కమిటి వారు అన్ని గేమ్స్ లో పాల్గొన్న విన్నర్స్ జాబితాను కార్యవర్గానికి అందించారు. కార్యవర్గం కువైట్ లో తెలుగు కళాసమితి కి చిరకాలం గా పలు సేవలందించిన వారితో బహుమతులను విజేతలకు అందించారు. 4.00 గం'లకు తెలుగు కళాసమితి కార్యవర్గ అధ్యక్షులు శ్రీ సాయి సుబ్బారావు గారు, మరియు ప్రధాన కార్యదర్శి శ్రీ వత్స గారు మాట్లాడుతూ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన కమిటీ సభ్యులకు, లేడీస్ వింగ్, వాలంటీర్స్, ఎలక్షన్ కమిటి, ఆటపాటలతో అలరించిన పిల్లలకు, పెద్దలకు, అక్కడకు విచ్చేసిన ప్రతి ఒక్కరికి తమ అభినందనలను ధన్యవాదములను తెలుపుతూ కార్యక్రమాన్ని ముగించారు.

TAGS: NRI
Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement