Abn logo
May 21 2020 @ 12:55PM

కువైట్‌లో ఒకేరోజు భారీగా పెరిగిన కోవిడ్ కేసులు

కువైట్ సిటీ: మ‌హ‌మ్మారి క‌రోనా వైర‌స్ గ‌ల్ఫ్‌లో స్వైర విహారం చేస్తోంది. సౌదీ అరేబియా, యూఏఈ, ఖ‌తార్‌, కువైట్‌లో ఈ వైర‌స్  విజృంభిస్తోంది. బుధవారం ఒక్క‌రోజే కువైట్‌లో 804 కొత్త కేసులు న‌మోదు కావ‌డం అక్క‌డ కోవిడ్ ఏ స్థాయిలో విరుచుకుప‌డుతుందో తెలియ‌జేస్తోంది. నిన్న న‌మోదైన 804 కొత్త కేసుల‌తో క‌లిపి ఇప్ప‌టివ‌ర‌కు 17,568 మందికి ఈ మ‌హ‌మ్మారి సోకిందని ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలియ‌జేసింది. అలాగే బుధ‌వారం 204 మంది క‌రోనా బాధితులు కోలుకుని ఆస్ప‌త్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు కోవిడ్ బారిన ప‌డి కోలుకున్న వారు 4,885 మంది అయ్యారు. నిన్న మ‌రో ముగ్గురు క‌రోనాతో మృత్యువాత ప‌డగా, ఇప్ప‌టివ‌ర‌కు కువైట్‌లో మొత్తం 124 మందిని ఈ మ‌హ‌మ్మారి పొట్ట‌న‌బెట్టుకుంది. ఇదిలాఉంటే... ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఈ వైర‌స్ ధాటికి‌ ఇప్ప‌టికే 3.29 ల‌క్ష‌ల మంది మ‌ర‌ణించారు. బాధితుల సంఖ్య‌ 50 ల‌క్ష‌లు దాటిపోయింది. 


Advertisement
Advertisement
Advertisement