Abn logo
Sep 23 2021 @ 16:07PM

వలసదారులకు పండగలాంటి వార్తను చెప్పిన Kuwait.. దాదాపు రూ.5 లక్షల మేర భారాన్ని తగ్గిస్తూ..

కువైత్ సిటీ: యూనివర్శిటీ డిగ్రీలేని, 60 ఏళ్లకు పైబడిన ప్రవాసులు తమ రెసిడెన్సీ పర్మిట్‌ను రెన్యువల్ చేసుకోవాలంటే 2వేల కువైటీ దినార్లు(సుమారు రూ.5లక్షలు) చెల్లించాల్సిందిగా ఇంతకుముందు కువైత్ మానవ వనరుల శాఖ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఇంత భారీ మొత్తం చెల్లించి ప్రవాసులు రెసిడెన్సీ పర్మిట్‌ను రెన్యువల్ చేసుకోవడం అసాధ్యమని చాలా మంది పెదవి విరిచారు. ఇది ప్రవాసులను పొమ్మనలేక పొగబెట్టడమే అవుతుందని పలువురు అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో కువైత్ చాంపర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఛైర్మన్ ముహమ్మద్ అల్ సకర్ తాజాగా ఆ దేశ ప్రధాని షేక్ సభా అల్ ఖలేద్‌కు ఓ లేఖ రాశారు. వెంటనే మావన వనరుల శాఖ ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా ఆయన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. మ్యాన్‌పవర్ అథారిటీ నిర్ణయం వల్ల మంచి నైపుణ్యం ఉన్న వర్కర్లు కువైత్ వదిలి వెళ్లిపోయే ప్రమాదం ఉందని, దీని ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ పడుతుందని సభా లేఖ ద్వారా ప్రధానికి తెలియజేసినట్లు తెలుస్తోంది. కనుక ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని ఆయన కోరారు.

ఇదిలాఉంటే.. మ్యాన్‌పవర్ బోర్డు ఛైర్మన్ డా. అబ్దుల్లా అల్ సల్మాన్‌.. మినిస్టర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పబ్లిక్ అథారిటీ అహ్మద్ అల్ మౌసా మధ్య ప్రవాసుల రెసిడెన్సీ రెన్యువల్ ఫీజు విషయమై ఏకాభిప్రాయానికి రాలేపోతున్నారని తెలుస్తోంది. హెల్త్ ఇన్సూరెన్స్‌తో కలిపి రెసిడెన్సీ ఫీజును 500 కువైటీ దినార్లుగా నిర్ణయిస్తే బావుంటుందని సంబంధిత అధికారులు అభిప్రాయ పడుతున్నారు. కాగా, ఇప్పటికైతే ప్రవాసుల రెసిడెన్సీ రెన్యువల్ రుసుము (2వేల కువైటీ దినార్లు) తగ్గించే విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, త్వరలోనే ఆయా సంబందిత శాఖలు దీనిపై మంత్రి మండలితో చర్చించే అవకాశం ఉన్నట్లు అక్కడి మీడియా పేర్కొంది. ఒకవేళ ఈ ఫీజు తగ్గితే మాత్రం ప్రవాసులపై దాదాపు రూ.5 లక్షల మేర భారం తగ్గుతుంది. ఇంతకుముందు మాదిరిగానే తక్కువ మొత్తానికే వలసదారులు తమ రెసిడెన్సీ పర్మిట్లను రెన్యువల్ చేసుకునే వీలు ఉంటుంది.        

ఇవి కూడా చదవండిImage Caption

తాజా వార్తలుమరిన్ని...