Advertisement
Advertisement
Abn logo
Advertisement

శ్రీశైలం దేవస్థానంలో సెక్యూరిటీ సిబ్బంది ఆగడాలు

కర్నూలు జిల్లా: శ్రీశైలం దేవస్థానంలో సెక్యూరిటీ సిబ్బంది ఆగడాలు పెరిగిపోయాయి. శ్రీశైలం, సున్నిపెంటకు చెందిన విద్యార్థినిల మెయిల్ ఐడీలు హ్యాక్ చేసి, ఫేస్‌బుక్‌లో యువతుల ఫోటోలు సేకరించి.. అమ్మాయిలతో అసభ్యంగా మాట్లాడిన ఆడియో వైరల్ అయింది. వ్యక్తిగత ఫోటోలతో అమ్మాయిలకు వలవేసి, లైంగిక వాంఛలు తీర్చాలని బెదిరింపులకు దిగారు. బాధితుల్లో పలువురు విద్యార్థినిలు, మహిళలు ఉన్నారు. ఓ సెక్యూరిటీ గార్డు సెల్‌ఫోన్‌లో వేలకొద్ది అమ్మాయిలు, మహిళల ఫోటోలు ఉన్నట్లు గుర్తించారు. కాగా ఆ సెక్యూరిటీని విధుల నుంచి తొలగించినట్లు తెలియవచ్చింది. పూర్తి సమాచారం అందవలసి ఉంది.

Advertisement
Advertisement