Abn logo
Jun 4 2020 @ 10:05AM

కుప్పం ఏఎస్సై రాజేంద్రప్రసాద్ ఆత్మహత్య

చిత్తూరు: కుప్పం పోలీస్టేషన్‌లో ఏఎస్సైగా పనిచేస్తున్న రాజేంద్రప్రసాద్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే ఆత్మహత్యపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెప్పారు. ఇది ఆత్మహత్య.. లేక హత్యే అనేది పోలీసులు సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేశారు. స్థానిక సీఐ ఈదురుబాషా వేధింపులు వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని కుటుంబ సభ్యులు వాగ్వివాదానికి దిగారు. సెలవులో ఇంటికి వచ్చినప్పుడు కూడా అనేకసార్లు పోన్లు చేసి ఆందోళనకు గురిచేసేవారని వాపోయారు. కుప్పం ఎస్సై, సీఐలతో పోన్లో మాట్లాడటానికి కూడా రాజేంద్రప్రసాద్ భయపడేవాడని.. అంతలా టార్చర్ పెట్టేవారంటూ మృతుడి బంధువులు ఆరోపించారు. రాజేంద్రప్రసాద్ మృతిపై కేసు నమోదు చేస్తున్నామని.. దర్యాప్తు చేసి తగు న్యాయం చేస్తామని మృతుడి కుటుంబ సభ్యులకు ఏఎస్పీ హామీ ఇచ్చారు.

Advertisement
Advertisement
Advertisement