Abn logo
Jul 15 2020 @ 03:12AM

ధోనీ విజయాలకు.. గంగూలీ పునాది

న్యూఢిల్లీ: సౌరవ్‌ గంగూలీ, ధోనీల్లో ఎవరు అత్యుత్తమ టీమిం డియా కెప్టెన్‌ అని స్టార్‌ స్పోర్ట్స్‌ ‘క్రికెట్‌ కనెక్టెడ్‌’ షో ఇటీవల నిర్వహించిన సర్వేలో..  స్వల్ప తేడాతో మహీ బెస్ట్‌ అనిపించుకున్న సంగతి తెలిసిందే. దీనిపై ఈ సర్వేలో పాల్గొన్న శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కర మాట్లాడుతూ గంగూలీ వేసిన పునాదులపై ధోనీ ట్రోఫీలు సాధించాడని  అన్నాడు. గొప్ప వారసత్వాన్ని అందించడానికి దాదా బాటలు వేస్తే.. ఆ ఫలాలు మహీకి దక్కాయని సంగక్కర చెప్పాడు. ఇదే విషయమై సర్వేలో పాల్గొన్న దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్‌ గ్రేమ్‌ స్మిత్‌ మాట్లాడుతూ గంగూలీ కెప్టెన్సీ, ధోనీ సారథ్యంలో తేడా ఏదైనా ఉందంటే అది మహీనేనని విశ్లేషించాడు. మిడిలార్డర్‌లో ఆడుతూ మ్యాచ్‌ను ముం దుకు తీసుకెళ్లడంతో పాటు ఫినిషర్‌గా ధోనీ అద్భుతంగా రాణించాడన్నాడు. దాదా టీమ్‌లో మహీ లాంటి ఆటగాడు ఉండుంటే.. అతడి ఖాతాలో మరిన్ని ట్రోఫీలు చేరేవని స్మిత్‌ అభిప్రాయపడ్డాడు.

Advertisement
Advertisement
Advertisement