Abn logo
Oct 22 2021 @ 21:51PM

కులగణన నిర్వహించాలి

గూడూరు, అక్టోబరు 22: బీసీ అభివృద్ధికి కుల గణన నిర్వహించాలని సీ మాంధ్ర బీసీ సంక్షేమ సం ఘం రాష్ట్ర అధ్యక్షుడు ఉల్లిపా యల శంకరయ్య అన్నారు. శుక్రవారం స్థానిక విశ్రాంత ఉద్యోగుల భవనంలో సీమాంధ్ర బీసీ సంక్షేమసంఘం ఆధ్వర్యంలో సమా వేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యా ప్తంగా సుమారు 60శాతం బీసీ కులాలు ఉన్నాయన్నారు. పేదలను ఆదుకోవా లంటే బీసీ కులాల వారీగా కచ్చితమైన గణాంకాలు అవసరమ న్నారు. ప్రభుత్వం వెంటనే కులగణన చేపట్టాలన్నారు. అనంతరం సంక్షే మ సంఘం నియోజకవర్గ నూతన కమిటీని ఎన్నుకున్నారు. లీలాకృష్ణ, వల్లి ప్రసాద్‌, హనుమంతరావు, మునిరాజా, మౌలాలి పాల్గొన్నారు.

కోట : బీసీ గురుకులాల పటిష్టతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ఉల్లిపాయల శంకరయ్య, రాష్ట్ర కార్యదర్శి వళ్లీప్రసాద్‌ కోరారు. విద్యానగర్‌లోని మహాత్మాజ్యోతిరావుపూలే బీసీ బాలికల గురుకులాన్ని శుక్రవారం వారు సందర్శించారు.  ప్రిన్సిపాల్‌ రామమూర్తికి పలు సూచనలిచ్చారు.