Abn logo
Jul 12 2020 @ 03:57AM

మండలాలు ఏర్పాటు చేయాలని కేటీఆర్‌కు వినతి

పరిగి: పరిగి నియోజకవర్గంలోని  చౌడాపూర్‌, మహ్మదాబాద్‌ల ను కొత్తగా మండల కేంద్రాలుగా ఏర్పాటు చేయాలని రాష్ట్ర మునిసిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ను పరిగి ఎమ్మెల్యే కె.మహేశ్‌రెడ్డి, డీసీసీబీ చైర్మన్‌ బి.మనోహార్‌రెడ్డి కోరారు. ఈ మేరకు శనివారం ప్రగతిభవనలో ఆయనను కలిసి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ అభివృద్ధి పనుల గురించి వివరించా రు. కొత్త మండలాల ఏర్పాటుకు మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారని ఎమ్మెల్యే  తెలిపారు. ఈ ప్రాంత అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇచ్చేందుకు కూడా మంత్రి కేటీఆర్‌ సానుకూలంగా స్పందించారని తెలిపారు. 

Advertisement
Advertisement