Jul 30 2021 @ 22:37PM

అనిల్‌ కథను చెప్పిన విధానం బావుంది! శరత్‌ మరార్‌

డ్రగ్స్‌ తీసుకోవడం, అమ్మడం వల్ల ఓ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి జీవితం ఎటువంటి చిక్కుల్లో పడింది? తీవ్రవాద ముఠాకు చెందిన వ్యక్తి పన్నిన పన్నాగంలో ఓ క్యాబ్‌ డ్రైవర్‌, ఆ ఉద్యోగి ఎలా చిక్కుకున్నారు? బయటపడటానికి ఏం చేశారు? అనే కథతో రూపొందుతున్న చిత్రం ‘క్షీరసాగర మథనం’. అనిల్‌ పంగులూరి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్‌, ఆర్ట్‌ అండ్‌ హార్ట్‌ క్రియేషన్స్‌ సంస్థలు నిర్మించాయి. మానస్‌ నాగులపల్లి, సంజయ్‌రావు హీరోలుగా నటించారు.


ఈ సినిమా ట్రైలర్‌ను శరత్‌ మరార్‌ విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ ‘‘కొంతమంది సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగులు కలిసి సినిమా నిర్మించారు. ట్రైలర్‌ చూశా. ఇంట్రెస్టింగ్‌గా కట్‌ చేశారు. కాన్సెప్ట్‌ ఏంటనేది చాలా క్లియర్‌గా చెప్పారు. ట్రైలర్‌లో అనిల్‌ పంగులూరి కథను చెప్పిన విధానం బావుంది. స్ర్కీన్‌ప్లే గ్రిప్పింగ్‌గా ఉంది. ఆగస్టు 6న థియేటర్లలో సినిమా విడుదలవుతోంది. టీమ్‌ అందరికీ ఆల్‌ ది బెస్ట్‌’’ అన్నారు. ‘‘మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందించిన చిత్రమిది. చరిష్మా శ్రీకర్‌, గౌతమ్‌ శెట్టి, ప్రియాంత్‌, మహేశ్‌, అధిరే అభి తదితరులు చిత్రంలో నటించారు.