చెన్నై/పెరంబూర్ : తమ కూటమిలో కమల్‌హాసన్ చేరితే స్వాగతిస్తామని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) అధ్యక్షుడు కేఎస్ అళగిరి అన్నారు. ఈరోడ్‌లో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ, మూడు కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా తొలిసారిగా గళం విప్పింది కాంగ్రెస్ పార్టీ అన్నారు. కానీ, సీఎం ఎడప్పాడి తాను రైతునేనని, ఆ చట్టాలు మేలు చేస్తాయని చెప్పడం సరికాదన్నారు. ఈ చట్టాల అమలు తో వ్యవసాయ రంగం కార్పొరేట్ సంస్థల చేతుల్లోకి వెళుతుందన్నారు. పార్లమెంటు ఎన్నికల ఫలితాలు అసెంబ్లీ ఎన్నికల్లో పునరావృతమవుతాయన్నారు.