Abn logo
Aug 6 2020 @ 11:49AM

`క్రిష్-4`లో కృతి సనోన్?

భారతీయులు ఎంతగానో అభిమానించే సూపర్ హీరో `క్రిష్`. సూపర్ హిట్ అయిన ఈ ఫ్రాంఛైజీలో ఇప్పటికే మూడు సినిమాలు వచ్చాయి. త్వరలో నాలుగో సినిమా పట్టాలెక్కనుందట. దర్శకనిర్మాత రాకేష్ రోషన్ ఈ సినిమా స్క్రిప్టును సిద్ధం చేస్తున్నారట. 


ఈ సినిమాలో హీరోయిన్ పాత్రకు కృతి సనోన్‌ను ఎంపిక చేశారట. ఇంతకుముందు వచ్చిన రెండు సినిమాల్లోనూ హృతిక్‌కు జోడీగా ప్రియాంకా చోప్రా నటించింది. ఇప్పుడామె హాలీవుడ్‌పైనే దృష్టి సారిస్తుండడంతో నాలుగో భాగానికి హీరోయిన్‌గా కృతిని తీసుకున్నారట. త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతున్నట్టు సమాచారం. 

Advertisement
Advertisement
Advertisement