Abn logo
Sep 21 2020 @ 18:38PM

కృతిశెట్టి క్యూట్‌ లుక్‌తో ‘ఉప్పెన’ పోస్టర్‌

Kaakateeya

క్రియేటివ్‌ డైరెక్టర్‌ సుకుమార్‌ శిష్యుడైన బుచ్చిబాబు సానా దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం 'ఉప్పెన'. మెగా మేనల్లుడు, సాయితేజ్‌ తమ్ముడు పంజా వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా, అందాల భామ కృతిశెట్టి హీరోయిన్‌గా ఈ చిత్రంతో పరిచయం కాబోతున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమిళ స్టార్‌ నటుడు విజయ్‌ సేతుపతి కీలక పాత్రలో నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక హీరోయిన్‌ కృతిశెట్టి పుట్టినరోజు(సెప్టెంబర్‌ 21) సందర్భంగా చిత్రయూనిట్‌ చిత్రం నుంచి ఓ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో కృతిశెట్టి చాలా క్యూట్‌గా, పక్కింటి అమ్మాయిలా కనిపిస్తోంది.

"క్యూటెస్ట్ అండ్ నేచుర‌ల్ యాక్ట్రెస్ కృతిశెట్టికి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు" అంటూ నిర్మాణ సంస్థ అధికారిక ట్విట్ట‌ర్ హ్యాండిల్ ట్వీట్ చేసింది. దాంతో పాటు షేర్ చేసిన పోస్ట‌ర్‌లో చేతులకు గాజులు వేసుకుంటూ అపురూపంగా వాటిని చూసుకుంటోన్న కృతిశెట్టి స్టిల్ అమితంగా ఆక‌ట్టుకుంటోంది. ఇప్ప‌టికే ఈ చిత్రానికి సంబంధించిన విడుద‌ల చేసిన పాట‌ల్లో, స్టిల్స్‌లో కృతి అంద‌చందాలు, ఆమె క‌నిపించిన తీరు ప్రేక్ష‌కుల‌ను అల‌రించాయి. వైష్ణ‌వ్‌తేజ్‌, కృతి మ‌ధ్య కెమిస్ట్రీ ముచ్చ‌ట‌గా అనిపిస్తోంది. రాక్‌స్టార్ దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూర్చిన పాట‌లు సంగీత‌ ప్రియుల‌ను అల‌రిస్తూ టాక్ ఆఫ్ ద టౌన్‌గా మారిన విషయం తెలిసిందే. సానుకూల ప‌రిస్థితులు ఏర్ప‌డి, థియేట‌ర్లు తెరుచుకోగానే చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు సన్నాహాలు చేస్తున్నారు.


Advertisement
Advertisement
Advertisement