Advertisement
Advertisement
Abn logo
Advertisement

అమెరికాలో కశ్మీరీ పండిట్లు అద్భుత విజయాలు సాధించారు: అమెరికా చట్టసభ సభ్యుడు

వాషింగ్టన్: అమెరికాలో అద్భుత విజయాలు సాధించిన భారతీయ అమెరికన్లలో కశ్మీరీ పండిట్లు ముందువరుసలో ఉన్నారని అమెరికా చట్టసభసభ్యుడు రాజా కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. అమెరికా ప్రగతిలో వారి పాత్ర ఎంతో ఉందని ప్రశంసించారు. ‘‘సర్వస్వాన్నీ కోల్పోయి ప్రాణాలు రక్షించుకునేందుకు పరిగెడుతున్నప్పుడు జీవితం అసలు అర్థం తెలుస్తుంది. మనం ఎక్కడ, ఏస్థితిలో ఉన్న జీవితాన్ని వేడుకగా చూడటం, మూలాలు మర్చిపోకుండా ఉండటం తెలుస్తుంది.’’ అని కశ్మీరీ పండిట్లను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. కశ్మీరీ పండిట్ల వలసలే కథాంశంగా నిర్మించిన ఓ సినిమాకు సంబంధించి వేడుకకు హాజరైన ఆయన ఈ కామెంట్స్ చేశారు. కశ్మీరీ పండిట్లు ఎదుర్కొన్న సవాళ్లు ఇతరులెవ్వరూ ఎదుర్కోలేదని ఆయన అభిప్రాయపడ్డారు. 


Advertisement

తాజా వార్తలుమరిన్ని...

Advertisement