Abn logo
Sep 16 2021 @ 09:51AM

ఫోన్ చేస్తే చాలు సమస్య పరిష్కరిస్తా: కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి

నెల్లూరు: రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ‘నేను నా కార్యకర్త’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.17 వ డివిజన్ మధురానగర్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఫోన్ నంబర్ ఇచ్చి కాల్ చేస్తే చాలు సమస్య పరిష్కరిస్తానంటూ హామీ ఇచ్చారు. ప్రజా సమస్యలపై అధ్యయనం చేసేందుకు ఈ కార్యక్రమం ప్రారంభించానన్నారు. 42 రోజుల పాటు 26 డివిజన్లలో ప్రతీ కార్యకర్త ఇంటికి వెళతాన్నారు. హంగులు ఆర్భాటాలు లేకుండా నిరాడంబరంగా యాత్ర కొనసాగిస్తానన్నారు. సీఎం జగన్ చేపట్టిన సంక్షేమ పథకాలకు మంచి స్పందన వస్తోందన్నారు. పర్యటనలో పేదల ఆదరణ సంతోషాన్ని కలిగిస్తోందని, కార్యకర్తల్లో నూతనోత్సహాన్ని నింపి పార్టీని మరింత బలోపేతం చేస్తానని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. 

ఇవి కూడా చదవండిImage Caption