Abn logo
Oct 23 2020 @ 22:07PM

అధికారంలోకి వచ్చాక జగన్ మడమ తిప్పారు : కూన

Kaakateeya

శ్రీకాకుళం : అమరావతిలోనే రాజధాని ఉంటుందని ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజలను నమ్మించి మోసం చేశారని టీడీపీ నేత కూన రవికుమార్‌ వ్యాఖ్యానించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక మాట మార్చి మడమ తిప్పారని ఆరోపించారు. రైతులతో కన్నీరు పెట్టిస్తే పుట్టగతులు ఉండవని కూన చెప్పుకొచ్చారు. శుక్రవారం నాడు శ్రీకాకుళంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజకీయాల్లో మిడిసిపడిన నేతలు కాలగర్భంలో కలిసిపోయారన్నారు. ప్రస్తుతం వైఎస్ జగన్ కేబినెట్‌లో కనీస అవగాహన లేని వ్యక్తులు మంత్రులుగా ఉన్నారని కూన ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Advertisement
Advertisement