Advertisement
Advertisement
Abn logo
Advertisement

కూలీల ఆటో బోల్తా


ముండ్లమూరు, నవంబరు 27: మండలంలోని వేముల, రమణారెడ్డిపాలెం గ్రామాల మధ్య మర్రిచె ట్టు సమీపంలో శనివారం ఉదయం కూలీల ఆటో బోల్తా పడింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఇంచుమిం చు 22 మందికి గాయాలయ్యాయి. వీరిలో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. గాయ పడిన కూలీలంతా నరసరావుపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కుటుంబసభ్యులు, వేముల గ్రామస్థులు ఘటనా స్థలానికి వచ్చి తమ బంధువులను హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే..

వేముల గ్రామానికి చెందిన నాలుగు చక్రాల ఆ టోలో కూలీలు మండలంలోని ఉమామహేశ్వర అగ్రహారం గ్రామంలో పత్తి తీసేందుకు వెళ్తున్నారు. వే ముల- రమణారెడ్డిపాలెం గ్రామాల మధ్య మూల మలుపు వద్ద ఎదురుగా పాల ఆటో వచ్చింది. దీన్ని తప్పించే క్రమంలో షడన్‌గా కూలీల ఆటోకు డ్రైవర్‌ నరసింహారావు బ్రేకు వేశాడు. దీంతో ఆటో తిరగబ డింది. అందులో ప్రయాణిస్తున్న వేముల ఎస్సీ కాలనీకి చెందిన బుట్టి దిబ్బయ్య, గోపనబోయిన కొం డమ్మ, సంపూరి రాములు, పాలడుగు సుబ్బులు, మాలపోలు పూజ, కూడలి సుబ్బులు, దేవవరపు తిరుపతమ్మ, ఆవులమంద త్రివేణి, సంకూరి సంపూర్ణ, గోపనబోయిన సుశీల, సంకూరి కాశీశ్వరి, గోపనబోయిన శ్రావణి, పెనుమాల వెంకటమ్మ, పెనుమాల చెన్నమ్మ, పాలెపు నాగులు, ఆవులమంద మంగమ్మ, గోపనబోయిన సరళ,  బట్టి కోమలి, బట్టి నాగమణి, మాలపోలు కోటేశ్వరరావు గాయపడ్డారు. 

వీరిలో బట్టి దిబ్బయ్య, సంకూరి రాములు, గోపనబోయిన సరళ, కొండమ్మ, సుశీల, పాలడుగు సు బ్బులుకు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన వారికి స్వ ల్ప గాయాలయ్యాయి. వీరందరినీ నరసరావుపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు. ప్రమాద విషయం తెలిసిన వెంటనే  హుటా హుటీన గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరు కున్నారు. క్షతగాత్రు లను ఆస్పత్రికి తర లించారు. 

డ్రైవర్‌ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమా?

ఆటోలో శక్తికి మించి కూలీలను ఎక్కించుకొని ని ర్లక్ష్యంగా డ్రైవింగ్‌ చేయటమే ప్రమాదానికి  ప్రధాన కారణంగా స్థానికులు భావిస్తున్నారు. అనుభవం లేని డ్రైవర్‌ ఎక్కువ మంది కూలీలను ఆటోలో ఎక్కించు కోవడంతో ప్రమాదం జరిగి ఉంటుందని పేర్కొంటున్నారు.


Advertisement
Advertisement