Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొండపల్లి మున్సిపాలిటీలో నెలకొన్న ఉత్కంఠ

విజయవాడ: కొండపల్లి మున్సిపాలిటీలో ఉత్కంఠ నెలకొంది. టీడీపీ అభ్యర్థులను తమ వైపు లాక్కోవాలని  వైసీపీ నేతలు చూస్తున్నారు. పోటాపోటీగా  టీడీపీ, వైసీపీ క్యాంప్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. టీడీపీ క్యాంపులో ఉన్న వారిపై తప్పుడు కేసులు పెట్టే ఆలోచనలో వైసీపీ నేతలు ఉన్నట్లు తెలుస్తోంది. కొండపల్లి మున్సిపాలిటీలో మొత్తం 29 వార్డులు ఉండగా, చెరో 14 వార్డులు టీడీపీ, వైసీపీ అభ్యర్థులు గెలిచారు. ఒక వార్డులో ఇండిపెండెంట్ గెలిచి టీడీపీకి మద్దతు ఇచ్చారు.  స్వతంత్ర వార్డు మెంబరు రాకతో టీడీపీ  మెజారిటీ సాధించింది. ఎక్స్‌అఫీషియో సభ్యులుగా టీడీపీ నుంచి ఎంపీ కేశినేని నాని, వైసీపీ నుంచి వసంత కృష్ణ ప్రసాద్ ఉన్నారు. 


Advertisement
Advertisement