Abn logo
Jun 19 2021 @ 20:20PM

కోనలో పోటెత్తిన భక్తులు

కోనలో పోటెత్తిన భక్తులు

రాపూరు, జూన్‌ 19:  శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల అనంతరం వచ్చే నాలుగవ శనివారం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు  దేవేరులతో శ్రీవారి కల్యాణాన్ని నిర్వహించారు. భక్తులు తలనీలాలు సమర్పించుకుని, అమ్మవారికి పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు.

లక్ష విరాళం

నల్గొండ జిల్లా మిరియాల గూడకు చెందిన పాడేటి పవన్‌కల్యాణ్‌ నిత్యాన్నదాన పథకానికి విరాళంగా లక్ష రూపాయలను  ఆలయ ఏసీ వెంకటసుబ్బయ్యకు అందజేశారు