Abn logo
Jun 4 2020 @ 11:01AM

ఈ నెల 6 నుంచి రేషన్ కార్డుల జారీ: కోన శశిధర్

అమరావతి: ఈనెల 6వ తేదీ నుంచి కొత్త దరఖాస్తుదారులకు రేషన్ కార్డులను జారీ చేయనున్నట్టు పౌరసరఫరాలశాఖ ఎక్స్ అఫీషియో కార్యదర్శి, కమిషనర్ కోన శశిధర్ తెలిపారు. ఇకపై గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఐదు రోజుల్లో దరఖాస్తుదారుల అర్హతలను పరిశీలించి రేషన్ కార్డులను అందజేస్తామని తెలిపారు. రేషన్ డోర్ డెలివరీలో భాగంగా కార్డుదారులకు ఉచితంగా బియ్యం సంచుల పంపిణీకి ఏర్పాట్లు చేయనున్నట్టు కమిషనర్ కోన శశిధర్ తెలిపారు.


Advertisement
Advertisement
Advertisement