Advertisement
Advertisement
Abn logo
Advertisement

తెలంగాణ రైతులు ఢిల్లీ రైతుల ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి: కోమటిరెడ్డి

హైదరాబాద్: తెలంగాణ రైతులు ఢిల్లీ  రైతుల ఉద్యమాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతులు ప్రధాని మోదీనే దిగివచ్చేలా చేశారని, సీఎం కేసీఆర్ మెడలు వంచడం పెద్ద లెక్కకాదన్నారు. కాంగ్రెస్ పార్టీలో నేతల మధ్య చిన్నచిన్న విభేదాలు ఉండటం సహజమని, ఇక నుంచి అందరం కలిసి పనిచేస్తామని స్పష్టం చేశారు. రెండేళ్లు కష్ట పడి కేసీఆర్‌ను గద్దె దించుతామన్నారు. టిఆర్ఎస్‌లో కూడా విభేదాలు ఉన్నాయని, కవిత సీఎం కావాలనే ఉద్దేశంతో రాజ్యసభ పదవి ఇస్తే తీసుకోలేదన్నారు. 107 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన బీజేపీకి తెలంగాణలో అంత సీన్ లేదని కోమటిరెడ్డి వ్యాఖ్యనించారు.

Advertisement
Advertisement