Advertisement
Advertisement
Abn logo
Advertisement

కొడాలి నానికి బూతులు తప్ప ఏమీ తెలియదు: వర్ల

అమరావతి: మంత్రి కొడాలి నానికి బూతులు తప్ప ఏమీ తెలియదని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మనిషిగా మారడానికి కొడాలి నాని ప్రయత్నించాలని సూచించారు. టీడీపీ అధినేత చంద్రబాబు కాళ్లపై సాష్టాంగపడే కొడాలి ఎమ్మెల్యే సీటు తెచ్చుకున్నారని గుర్తుచేశారు. తనను విమర్శించే అర్హత కొడాలి నానికి లేదని హెచ్చరించారు. ‘‘ఓడినా, గెలిచినా.. నేను నీతి, నిజాయితీలకు కట్టుబడి ఉంటా. నీలా ఊరకుక్కలా పార్టీల వెంట పరిగెత్తి గెలిచి.. బూతుల మంత్రి, బుద్ధిలేనివాడని పేరు తెచ్చుకోలేదు. అసెంబ్లీ ఘటన కారణంగా మహిళలు దాడిచేస్తారేమోనని.. కొడాలి నానికి సీఎం జగన్‌రెడ్డి సెక్యూరిటీ పెంచారు’’ వర్ల రామయ్య తెలిపారు.

Advertisement
Advertisement