Advertisement
Advertisement
Abn logo
Advertisement

అందుకే 3 రాజధానుల నిర్ణయం వెనక్కి తీసుకున్నాం: Kodali Nani

అమరావతి: మూడు రాజధానుల నిర్ణయాన్ని జగన్ ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంపై పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్పందించారు. సోమవారం అసెంబ్లీ వద్ద మీడియాతో మాట్లాడుతూ.. టెక్నికల్‌గా చాలా సమస్యలు వస్తున్నాయనే మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నట్లు కొడాలి నాని తెలియజేశారు. మూడు రాజధానుల రద్దుపై కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కేబినెట్‌ నిర్ణయాన్ని అసెంబ్లీలో ప్రకటిస్తామన్నారు. అసెంబ్లీ జరుగుతున్నప్పుడు బయట తాము మాట్లాడకూడదని చెబుతూ నాని అక్కడి నుంచి వెళ్లిపోయారు.

Advertisement
Advertisement