Abn logo
Sep 28 2020 @ 05:50AM

కేసీ కాలువకు 2వేల క్యూసెక్కులు విడుదల

పాములపాడు, సెప్టెంబరు 27: సుంకేసుల జలాశయం నుంచి కర్నూలు-కడప కాలువకు 2వేల క్యూసెక్కుల నీటి విడుదల చేస్తున్నట్లు కేసీ కెనాల్‌ ఏఈ నరేష్‌ ఆదివారం తెలిపారు. మండలంలోని శాంతినిలయం లాకెన్స్‌ల వద్దకు 1,500 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోందన్నారు. అక్కడి నుంచి నిప్పులవాగుకు 1,400 క్యూసెక్కులు, తూడిచెర్ల ఉపకాలువకు 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన వివరించారు. అలగనూరు ఇన్‌లెట్‌ చానల్‌కు నీటి విడుదలను నిలిపివేశారు. 


Advertisement
Advertisement
Advertisement