Abn logo
Sep 28 2020 @ 05:48AM

థామస్‌ మృతి బాధాకరం

మాజీ మంత్రి భూమా అఖిలప్రియ

చాగలమర్రి, సెప్టెంబరు 27: మండలంలోని బ్రాహ్మణపల్లె గ్రామంలో సమయానికి వైద్యం అందక గుండెపోటుతో గాలిపోతు థామస్‌ మృతి చెందడం బాధాకరమని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ అన్నారు. ఆదివారం ఫోన్‌ ద్వారా మాట్లాడుతూ ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించి కుటుంబం పట్ల సానుభూతి వ్యక్తం చేశారు.


బాధిత కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. టీడీపీ ఆళ్లగడ్డయువ నాయకుడు భూమా జగత్‌ విఖ్యాతరెడ్డి, మాజీ ఎంపీపీ రఘునాథ్‌రెడ్డి తదితరులు థామస్‌ మృతి పట్ల సంతాపం ప్రకటించారు. 

Advertisement
Advertisement
Advertisement