Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రజాస్వామ్యంలో ప్రజల మనోభావాలే ముఖ్యం: కిషన్ రెడ్డి

హైదరాబాద్: ప్రజల మనోభావాల ప్రకారం రాజధానిపై ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిదేనని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకున్నట్లు ప్రభుత్వం ప్రకటనపై స్పందించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ  ప్రజా స్వామ్యంలో ప్రజల మనోభావాలే ముఖ్యమన్నారు. ప్రజల అభీష్టం మేరకే ఏపీ బీజేపీ అమరావతి రాజధానికి మద్దతుగా నిర్ణయం తీసుకుందన్నారు. రైతుల‌ మేలును దృష్టిలో పెట్టుకునే కేంద్రం రైతు చట్టాలను వెనక్కి తీసుకుందని కిషన్ రెడ్డి అన్నారు.

Advertisement
Advertisement