Advertisement

సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆరోగ్యంపై కిమ్స్ హెల్త్ బులిటెన్

ప్రముఖ తెలుగు సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి తీవ్ర అస్వస్థతతో.. హైదరాబాద్‌లోని కిమ్స్‌ హస్పిటల్‌లో చికిత్స తీసుకుంటున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలపై కిమ్స్ హాస్పిటల్ యజమాన్యం స్పందించింది. రెండు రోజుల క్రితం సిరివెన్నెల సీతారామశాస్త్రి న్యుమోనియాతో బాధపడుతూ హాస్పిటల్‌లో చేరారని, ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, ఎవరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిపారు. 


‘‘ప్రముఖ తెలుగు సినీ గీతరచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి రెండు రోజుల క్రితం న్యుమోనియాతో ఇబ్బందిపడుతూ.. చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌‌లో చేరడం జరిగింది. ప్రస్తుతం ఆయనను ఐసియులో ఉంచి నిపుణులైన డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. లంగ్స్‌కి సంబంధించిన సమస్య నుండి ఆయన కోలుకుంటున్నారు. 24 గంటలుగా ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది..’’ అని కిమ్స్ హాస్పిటల్ యజమాన్యం తెలియజేసింది.

Advertisement