Advertisement
Advertisement
Abn logo
Advertisement

మూత్రపిండాలు శుభ్రపడాలంటే కొత్తిమీరతో ఇంట్లోనే ఇలా చేస్తే..

ఆంధ్రజ్యోతి(16-11-2021)

ఏళ్ల తరబడి మన మూత్రపిండాలు నిరంతరంగా రక్తాన్ని వడగడుతూ, ఉప్పు, విషాలు, మలినాలను తొలగిస్తూ ఉంటాయి. ఈ క్రమంలో మూత్రపిండాల పనితీరు కొంత మేరకు కుంటుపడుతూ ఉంటుంది. ఈ పరిస్థితిని సరిదిద్దాలంటే మూత్రపిండాలను శుభ్రం చేసుకోవాలి. ఇందుకోసం....


ఒక కొత్తిమీర కట్టను తీసుకుని, ఆకులను శుభ్రంగా నీళ్లతో కడగాలి. తర్వాత సన్నగా తరిగి, గిన్నెడు నీళ్లలో వేసి, 10 నిమిషాల పాటు మరిగించాలి. చల్లారిన తర్వాత వడగట్టి సీసాలో నింపి ఫ్రిజ్‌లో నిల్వ చేసుకోవాలి. ఈ నీటిని ప్రతి రోజూ తాగుతూ ఉంటే, మూత్రపిండాలు శుభ్రపడతాయి. ఫలితంగా శరీరంలో చోటుచేసుకునే మార్పును ప్రత్యక్షంగా గ్రహించవచ్చు. శరీరం తేలికవడంతో పాటు, చలాకీగా తయారవుతుంది. మలబద్ధకం వదిలిపోతుంది. పేగుల కదలికలు మెరుగవుతాయి.

Advertisement
Advertisement