Advertisement
Advertisement
Abn logo
Advertisement

కిడ్నీ ఆరోగ్యానికి ఇవి...

కిడ్నీ సమస్యలు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అంటే... ఇదిగో ఈ ఆహారం బెస్ట్‌ అంటున్నారు పోషకాహార నిపుణులు. వారు సూచిస్తున్న ఆహార విశేషాలు ఇవి...

 రోజూ ఒక ఆపిల్‌ తింటే కిడ్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఆపిల్‌లో ఉండే పెక్టిన్‌ అనే పదార్థం కిడ్నీ డ్యామేజ్‌కు కారణమయ్యే వాటిని నిరోధించడంలో సహాయపడుతుంది.

 బెర్రీలు ఎక్కువగా తీసుకోవాలి. వీటిలో పోషకాలతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. కిడ్నీని కాపాడటంలో ఇవి కీలకపాత్ర పోషిస్తాయి. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, కాన్‌బెర్రీలు... ఏవైనా తినొచ్చు.

నిమ్మజాతికి చెందిన ఫ్రూట్స్‌ తినాలి. ఆరెంజ్‌, నిమ్మ వంటి సిట్రస్‌ ఫ్రూట్స్‌లో విటమిన్‌-సి పుష్కలంగా లభిస్తుంది. రోజూ నిమ్మరసం తాగే వారిలో కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం తగ్గినట్లు అధ్యయనంలో తేలింది.

 క్యాబేజీలో సోడియం తక్కువగా ఉంటుంది. కిడ్నీ వ్యాధులను నిరోధించడంలో ఈ వెజిటబుల్‌ చక్కగా ఉపయోగపడుతుంది.

చిలగడదుంప, కాకరకాయ కూడా కిడ్నీకి మేలు చేసేవే. విటమిన్‌-సి, ఫోలేట్‌, ఫైబర్‌ కంటెంట్‌ ఎక్కువగా లభించే క్యాలీఫ్లవర్‌ కూడా కిడ్నీ ఆరోగ్యానికి పనికొస్తుంది.

 కీరదోస, వాటర్‌మెలన్‌ వంటివి క్రమంతప్పకుండా తినాలి. కిడ్నీలలో అధికంగా ఉన్న సోడియంను బయటకు పంపించడంలో కొబ్బరినీళ్లు చక్కగా ఉపయోగపడతాయి.

Advertisement
Advertisement