Abn logo
Dec 5 2020 @ 08:10AM

రైతుల ఆందోళనలో ఖలిస్థాన్ మద్ధతుదారులు

న్యూఢిల్లీ : కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల నిరసన కార్యక్రమానికి ఖలిస్థాన్ మద్ధతుదారులు ప్రవేశించారు. వాంకోవర్ లో వ్యవసాయ చట్టానికి వ్యతిరేకించిన ఖలిస్థాన్ వాదులు జెండాలతో ర్యాలీ తీశారు. కేంద్ర ప్రభుత్వంతో ఐదవ రౌండ్ చర్చలకు ఒకరోజు ముందు రైతులు డిసెంబరు 8వతేదీన భారత్ బంద్ చేస్తున్నట్లు ప్రకటించారు. మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న డిమాండును కేంద్ర ప్రభుత్వం అంగీకరించకుంటే తమ ఆందోళనను ఉద్ధృతం చేస్తామని రైతులు హెచ్చరించారు.  రైతుల నిరసనతో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ఆందోళన వ్యక్తం చేసిన పంజాబ్ వైద్యుల బృందం రైతులను పరీక్షించారు.

అనారోగ్యం పాలైన వారికి వైద్యులు మందులు కూడా ఇచ్చారు. ఢిల్లీ-ఘజియాబాద్ నగరాలను కలిపే జాతీయరహదారిని మూసివేశారు. ఢిల్లీలోకి రైతులు ప్రవేశించకుండా టైగ్రి సరిహద్దుల్లో భద్రతను పెంచారు. రైతుల ఆందోళనలో ‘ఖలిస్థాన్ జిందాబాద్’ అనే నినాదంతో ముద్రించిన ట్రాక్టరు, ఏకే -47 రైఫిల్ చిత్రంతో ఖలిస్థాన్ మద్ధతుదారులు పాల్గొన్నారు. ఖలిస్థానీలు తమ ర్యాలీలో ఇందిరాగాంధీ, నరేంద్రమోదీల పోస్టర్లను ప్రదర్శించారు.

Advertisement
Advertisement
Advertisement